Thursday, May 2, 2024

LIVE from Medak | జిల్లా ఎస్పీ ఆఫీసు ప్రారంభించిన సీఎం కేసీఆర్​

CM Sri. KCR Participating in Inauguration of District Police Office at Medak District

https://youtu.be/l_fYGnGCBmY

మెద‌క్‌ ఎస్​పీ ఆఫీసును ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో (ప్ర‌భ న్యూస్‌): మెద‌క్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌టిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆర్ ఎస్ పార్టీ ఆఫీసును ఆయ‌న ప్రారంభించారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ ఆఫీసును ప్రారంభించారు. కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావు, ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్​ త‌దిత‌రులున్నారు. కాగా, పూజారులు ఆయ‌న‌ను స్వాగ‌తించి ఆశీర్వ‌చ‌నాలు అందించారు. ఎస్పీ ఆఫీసు ప్రారంభోత్సవం అనంతరం ఎస్పీ రోహిణీ ప్రియదర్శినిని కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్​ పోలీసుల గౌరవం వందనం స్వీకరించారు..

- Advertisement -

ఇక‌.. హైదరాబాద్‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ నుంచి మొదక్‌ పర్యటనకు వెళ్తున్న‌ సీఎం కేసీఆర్‌కు దారి పొడవునా జననీరాజనాలు పలుకుతున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్లు వస్తే పటాన్‌చెరు ప్రాంతం సస్యశ్యామలం కానుందన్నారు. ప్రజలందరూ మళ్లీ బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్‌ కోరారు.

కాగా, దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్‌ సొమ్ము పంపిణీకి బుధవారం సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు. బీడీ టేకేదారులు, ప్యాకర్లకు రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ రెండింటి ప్రారంభంతో మరో చారిత్రక ఘట్టానికి మెదక్‌ పట్టణం వేదిక కానున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement