Sunday, May 5, 2024

LIVE from Medak | జిల్లా కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్​

CM Sri. KCR Participating in Inauguration of Integrated District Offices Complex at Medak District

https://youtu.be/7I3Soy92WDo

https://www.facebook.com/TelanganaCMO/videos/3529020637312519/?extid=CL-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=X4moGX

- Advertisement -

ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో (ప్ర‌భ న్యూస్‌): మెద‌క్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌టిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆర్ ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించిన సీఎం.. ఆ తర్వాత జిల్లా ఎస్పీ ఆఫీసును ప్రారంభించి ఎస్పీ రోహిణి ప్రియదర్శినిని ఆశీర్వదించారు. ఆ తర్వాత పోలీసుల గౌరవం స్వీకరించారు. అక్కడి నుంచి కలెక్టరేట్​ సమీకృత ఆఫీసుల సముదాయాన్ని ప్రారంభించారు. కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావు, ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్​ త‌దిత‌రులున్నారు.

కాగా, పూజారులు ఆయ‌న‌ను స్వాగ‌తించి ఆశీర్వ‌చ‌నాలు అందించారు. ఎస్పీ ఆఫీసు ప్రారంభోత్సవం అనంతరం ఎస్పీ రోహిణీ ప్రియదర్శినిని కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్​ పోలీసుల గౌరవం వందనం స్వీకరించారు..

కలెక్టరేట్​ ప్రారంభోత్సవం సందర్భంగా కలెక్టర్​ రాజర్షిషాకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సీటులో కూర్చోబెట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆచారం ప్రకారం.. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement