Wednesday, May 15, 2024

ఈ ఏడాది జలవనరుల్లో పెద్ద ఎత్తున చేప, రొయ్య పిల్లల విడుదల..

ఈ ఏడాది రాష్ట్రంలోని 26,778 నీటి వనరుల్లో 88.52 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను చెరుల్లో విడుదల చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని చెప్పారు. వీటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఈనెలాఖరు లోగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో భారీగా మత్స్య సంపద పెరిగిందన్నారు.

అర్హులైన ప్రతి మత్స్యకారుడికి ప్రభుత్వ పథకాల వలన లబ్ధి చేకూరాలని, దీనిలో భాగంగా మత్య్సకారులను సొసైటీలలో సభ్యులుగా చేర్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ఇప్పటికే గడువు ముగిసిన మత్స్యకార సొసైటీల ఎన్నికల నిర్వహణ, నూతన జిల్లాల వారీగా కొత్త సొసైటీల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement