Tuesday, May 14, 2024

లాల్ గడి మలక్ పేటలో ఫార్మాసుటికల్స్ ల్యాబ్ ప్రారంభించిన కేటీఆర్

శామీర్ పేట, (ప్రభ న్యూస్ ): శామీర్ పేట మండలంలోని లాల్ గడి మలక్ పేట పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫేర్రింగ్ ఫార్మాసుటికల్స్ ల్యాబ్ ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఇలాంటి సంస్థల ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయాన్నారు. అలాగే ఈ సంస్థలలో కొత్త కొత్త పరిశోధనలు జరిగి తద్వారా అభివృద్ధిని మరింత సాధించవచ్చని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఫార్మాసుటికల్స్ సంస్థ ప్రతినిధులు, ఎంపీపీ ఎల్లుబాయ్ బాబు, జడ్పీటీసీ అనిత, లాల్ గడి మలక్ పేట సర్పంచ్ వనజ , ఎంపీటీసీ ఇందిరా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement