Sunday, April 28, 2024

హైదరాబాద్ లో వర్షం..

హైద‌రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియ‌డంతో చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం నెల‌కొంది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారా‌హిల్స్, ఫిలింనగర్ లో భారీ వ‌ర్షం కురిసింది. అలాగే, కూకట్ పల్లి, ఎస్ ఆర్ నగర్, మదీనాగుడ, చందా నగర్, బీ హెచ్ ఈ ఎల్, మాసబ్ ట్యాంక్, నాంపల్లి, మెహదీపట్నంతో పాటు ప‌లు ప్రాంతాల్లో ఈ రోజు వర్షం పడింది. ఈ నెలలో ఎండ‌లు మండిపోయిన విష‌యం తెలిసిందే. అయితే, కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో చిరుజ‌ల్లులు ప‌డుతుండ‌డంతో వేడిమి త‌గ్గింది. ఉపరితల ఆవర్తనంతో అకాల వర్షాలు పడుతున్నాయని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement