Sunday, April 28, 2024

TS : నేత‌న్న‌ల‌పై మీకెందుకీ క‌క్ష‌..రేవంత్ రెడ్డికి కెటిఆర్ బ‌హిరంగ లేఖ..

చేనేత కార్మికులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష గట్టిందని.. ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోవట్లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తాజాగా ఓ లేఖ రాశారాయ‌న‌.

నేత‌న్న‌లు ఆత్మ‌హ‌త్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..! కార్మికులు రోడ్డున ప‌డ్డా క‌న‌క‌రించ‌రా..? అని కేటీఆర్ అడిగారు. ఈ ప‌దేండ్ల‌లో నేత‌న్న‌ల‌కు చేతి నిండా పని క‌ల్పిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత స‌మైక్య రాష్ట్రంలో నాటి సంక్షోభం నెల‌కొంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. నేత‌న్న‌ల‌కు ఆర్డ‌ర్లు ఆపడం స‌రికాద‌న్నారు. బీఆర్ఎస్ హ‌యాంలో మాదిరే నేత‌న్న‌ల‌కు చేతి నిండా ప‌ని క‌ల్పించాల‌ని కోరారు.

- Advertisement -

బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశారు. చేనేత మిత్రా వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప‌క్క‌న పెట్టింద‌ని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం అందుతున్న అన్నీ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలి.

అవసర‌మైతే మరింత సాయం చేసి ఆదుకోవాల‌న్నారు. కేవలం గత ప్రభుత్వంపై దుగ్దతో నేతన్నల పొట్ట కొట్టడం సరైంది కాదు. రైతన్న మాదిరే, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధకరం. వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని కేటీఆర్ హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement