Sunday, April 28, 2024

IPL : టేబుల్ టాప్ లో కెకెఆర్…దిగువ‌లో ముంబై ఇండియ‌న్స్..

ఐపీఎల్ 17వ సీజన్‌లో మ్యాచులు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన జట్లు అంచనాలను మించి రాణిస్తుండగా, ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జట్లు చతికిల పడుతున్నాయి. మ్యాచ్ మ్యాచ్‌కు పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటుంన్నాయి ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 16 మ్యాచులు పూర్తి అయ్యాయి.

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఏదీ, ఆఖరి స్థానంలో ఉన్న జట్టు ఏదీ. మిగిలిన జట్లు ఏ స్థానాల్లో ఉన్నాయో ఓ సారి చూసేద్దాం..
బుధవారం విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకువచ్చింది. ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ కేకేఆర్ విజయం సాధించింది. 6 పాయింట్లతో +2.518 నెట్‌ రన్‌రేట్‌ను కలిగి ఉంది.

ఆడిన మూడు మ్యాచుల్లో గెలుపొందినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలోనే ఉంది. కేకేఆర్ నెట్‌రన్‌రేట్ కంటే తక్కువ ఉండడమే ఇందుకు కారణం. 6 పాయింట్లతో +1.249 నెట్ రన్‌రేట్‌ను ఆర్ఆర్ కలిగి ఉంది.

- Advertisement -

పాయింట్ల పట్టికలో రుతురాజ్ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మూడో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడగా రెండు మ్యాచుల్లో గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది. 4 పాయింట్లతో పాటు +0.976 నెట్‌రన్‌రేట్ ఉంది.

మూడు మ్యాచులు ఆడగా రెండు మ్యాచుల్లో గెలిచి ఓ మ్యాచ్‌లో ఓడిన లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో స్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లతో పాటు +0.483 నెట్‌రన్ రేట్ ఉంది.

కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఐదో స్థానంలో ఉంది. మూడు మ్యాచులు ఆడగా రెండు మ్యాచుల్లో గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉండగా నెట్ రన్ రేట్ -0.738గా ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే ఆరో స్థానంలో ఉంది. మూడు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 2 పాయింట్లు ఉండగా నెట్ రన్ రేట్ +0.204గా ఉంది.

– ఏడో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. మూడు మ్యాచులు ఆడగా ఒక్క మ్యాచులో మాత్రమే గెలిచింది. ఆ జట్టు ఖాతాలో 2 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేట్ -0.337.

– అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనిమిదో స్థానంలో ఉంది. నాలుగు మ్యాచులు ఆడిన ఆ జట్టు ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్‌లో గెలుపొందింది. మూడు మ్యాచులు ఓడిపోయిన ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ -0.876గా ఉంది. ..

– నాలుగు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్‌లోనే గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిదో స్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉండగా నెట్ రన్ రేట్ -1.347గా ఉంది.

– ఇక ఈ సీజన్‌లో గెలుపుబోణీ కొట్టని ముంబై ఇండియన్స్ ఆఖరి స్థానంలో నిలిచింది. మూడు మ్యాచులు ఆడిన ముంబై ఒక్క మ్యాచులోనూ గెలవలేదు. ఆ జట్టు నెట్ రన్ రేట్ -1.423గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement