Saturday, April 27, 2024

KHM: ఆళ్లపల్లి మండలంలో విప్ రేగా విస్తృత పర్యటన..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పినపాక నియోజకవర్గంలో గల ఆళ్లపల్లి మండలంలోని ముత్తాపురం, రాయపాడు, అనంతోగు, సింగారం, మైలారం, లక్ష్మీపురం, రాఘవాపురం, రామంజిగూడెం, మర్కోడు, సందిబంధం, పాతూరు, చెలగట్టు, బండారిగూడెం, చంద్రాపురం, కర్ణగూడెం, బొడాయికుంట, నడిమిగూడెం, జాకారం, శుద్ధరేవు, పెద్దవెంకటాపురం, సింగారం, రాయిగూడెం, తిర్లాపురం, పెద్దూరు, చింతోల్లగుంపు, చంద్రపురం, కిచ్చెనపల్లి, పాలగుంపు, తీగలుంచ, ఇప్పనపల్లి, తునికిబండల, వలసల్లా,పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కలియ తిరుగుతున్నారు.

సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోను, చేసిన అభివృద్ధిని, చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలపై హామీలను ఇస్తూ, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేస్తూ, వారి విధి, విధానాలను వివరిస్తూనే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా రేగా కాంతారావు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను, ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement