Monday, April 29, 2024

లబ్ధిదారుల మదిలో ఏముంటుంది?.. పుస్తకావిష్కరణ చేసిన మంత్రి పువ్వాడ

తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక పథకాలు, వాటి అమలు తీరు తెన్నెలపై తెలంగాణ అభిమాని, రచయిత ఇందూరు కృష్ణమా చారి రచించిన టీఆర్ఎస్ పాలిత తెలంగాణ లబ్ధిదారుల మదిలో ఏముంటుంది ? అనే పుస్తకాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం VDO’s కాలనీ లోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. స్వాతంత్య్రానికి పూర్వం తెలంగాణ ప్రాంతం నైజాం నవాబు పాలనలో ఉన్న అంశాలను నాటి నుండి క్షుణ్ణంగా వివరించడం జరిగిందని రచయిత కృష్ణమా చారి వివరించారు. కోటి హృదయాల్లో ఉద్యమ జ్వాలను రగిల్చి స్వరాష్ట్రం ప్రాముఖ్యతను ప్రతి పౌరుడు ఆలోచించుకునే విధంగా ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి రాష్ట్రాన్ని సాధించుకోవడం ఎవరికైనా సాధ్యమా అని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పాలన క్రమంలో ఎన్నో పథకాల ద్వారా లబ్ధిదారుల మదిలో టీఆర్ఎస్ పాలన పట్ల ఎలాంటి అభిప్రాయం కృతజ్ఞతా భావంతో ఉన్నారో అంచనావేసి వివరణాత్మంగా ఈ పుస్తకంలో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి పేదల సంక్షేమమే తన బాధ్యతగా తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, నాటి ఉద్యమ సారథి నేతృత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, సుడా చైర్మన్ విజయ్‌, కార్పొరేటర్ కమర్తపు మురళి, నాయకులు RJC కృష్ణ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement