Monday, April 29, 2024

ఖమ్మంలో ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

టీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి హాజరై టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల పక్షపాతిగా పరిపాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ భవిష్యత్తు తరాల్లోనూ ఆయనే సీఎంగా పీఠాన్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

Advertisement

తాజా వార్తలు

Advertisement