Tuesday, May 7, 2024

జులై 18న తెలంగాణ ర‌క్ష‌ణ స‌మితిలో భారీ చేరిక‌లు : నరాల సత్యనారాయణ

కొత్తగూడెం : తెలంగాణ రక్షణ సమితిలోకి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుండి పెద్దఎత్తున చేర‌నున్నార‌ని తెలంగాణ రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ అన్నారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పేరుమీద ఉన్న ఏకైక పార్టీ తెలంగాణ రక్షణ సమితి అని, ప్రజల ఆశలకు, ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడింద‌న్నారు. ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న భారీ చేరికలు జులై 18న హైదరాబాద్ లో జరుగుతుండడం సంతోషకర‌మ‌న్నారు. మా పార్టీ ఏఒక్క‌ పార్టీకి వ్యతిరేకం కాదని, ఏ పార్టీతో మాకు సంబంధం లేదన్నారు. మా పార్టీ జెండా, ఎజెండా తెలంగాణ ప్రజలే అన్నారు. ఓడిన‌, గెలిచిన‌ తెలంగాణ రాష్ట్రంలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలలో, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ బాధ్యులు మొహమ్మద్ సలీం ఖురేషి తిలక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement