Saturday, April 27, 2024

భారీ వ‌ర్షాలు.. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

రానున్న 24 గంటల్లో భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున మండలంలోని అందరు అధికారులు, ప్రజా ప్రతినిధులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కావున అందరు పంచాయతీ కార్యదర్శులు తమ గ్రామాలలో వార్డ్ సభ్యులు, సర్పంచులు, యంపీటీసీలు, సిబ్బందిని అప్రమత్తం చేయాల‌ని అధికారులు సూచించారు. అలాగే లోలెవల్ క్యాజువేల వద్ద ప్రవాహం ఎక్కువగా ఉంటే ప్రజలు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి సిద్దంగా ఉండాల‌న్నారు.

గుండ్రాత్ పల్లి, దామెరకుంట, విలాసాగర్, గంగారంలో అవసరమైతే సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు రెవెన్యూ సిబ్బందితో సమన్వయం చేసుకుని పాఠశాలలో అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాల‌న్నారు.
అత్యవసర పరిస్థితిలో…
ఎంపీవో 9182600721, ఎంపీడీవో 9121238643, తహసీల్దారు 9652608367 ఎస్‌ఐ 9440795194 నంబర్ లకు ఫోన్ చేయగలరు. అధిక వర్షాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవలసినదిగా కోరనైనది.

Advertisement

తాజా వార్తలు

Advertisement