Tuesday, October 8, 2024

KHM: హామీలు అమలు చేయని బీఅర్ఎస్ ను ఓడించండి..

ఇల్లందు : గత రెండు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయని బీఆర్ఎస్ ను ఓడించాలని కాంగ్రెస్ నాయకులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు మండల పరిధిలోని సుభాష్ నగర్ పంచాయితీలో కోరం కనకయ్య విజయాన్ని కాంక్షిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రెండు వందల విద్యుత్ ఉచితంగా అందిస్తామని, 500 కే సిలిండర్ ఇస్తామని, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు అందజేస్తామని ఓటర్లకు తెలిపారు.

హస్తం గుర్తుకు ఓటు వేసి కోరం కనకయ్యను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నెల వెల్లి నరసింహా రావు, వార్డ్ సభ్యులు ఆళ్ళ నాగేశ్వర రావు, గుమ్మడి అపర్ణ, కోటి, ధనుంజయ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పులి సైదులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement