Tuesday, April 30, 2024

Amit Shah: కేసీఆర్​ను జైలుకు పంపిస్తాం… అమిత్‌షా

సామాజిక న్యాయం కోసం తెలంగాణలో అధికారంలోకి వచ్చాక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించింది తామేన‌ని అమిత్‌షా పేర్కొన్నారు. జనగామలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొని అమిత్ షా ప్రసంగించారు. ఓవైసీకి భయపడి కేసీఆర్‌ విమోచన దినోత్సవాల జరపడం లేదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారికంగా జరుపుతామని హామీ ఇచ్చారు.

భైరాన్​పల్లిలో అమరవీరుల కోసం స్మారక స్తూపాన్ని నిర్మిస్తామని తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల నిర్మిస్తామని చెప్పి కేసీఆర్ సర్కార్.. దాన్ని మరిచి భూ కబ్జా ల్లో మునిగి తేలుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికలు రాష్ట్ర, దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. వల్లభాయ్ పటేల్ కృషి వల్ల రజాకార్ల నుంచి విముక్తి పొందామని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.

తెలంగాణ ఉద్యమకారులను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగా నిజాం నుంచి తెలంగాణ విముక్తమైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, నిన్నటి వరకు ఉన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కుటుంబ పార్టీలు అని విమర్శించారు. ఇప్పటి వరకు బీసీని ఎవరూ ముఖ్యమంత్రి చేసే ధైర్యం చేయలేదన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఇప్పటి వరకు వారి గురించి ఏ పార్టీ ఆలోచించలేదన్నారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని ఆరోపించారు. వీరి అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి జైలుకు పంపించే బాధ్యత బీజేపీదే అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, మియాపూర్ భూములు, ఓఆర్ఆర్… ఇలా అన్నింటా కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారని, తాము అధికారంలోకి రాగానే వాటిని తొలగించి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని హామీ ఇచ్చారు. మోదీ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కలిపిస్తోందన్నారు. వరికి రూ.3100 మద్దతు ధర ఇస్తామని, ఫసల్ బీమాను ఉచితంగా ఇస్తామన్నారు. ప్రధాని మోదీ కారణంగా ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement