Tuesday, November 28, 2023

Renuka Chowdhury: ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ గాలి వీస్తోంది…

ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ గాలి వీస్తోందని రేణుకా చౌద‌రి పేర్కొన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైనంత మెజారిటీ తప్పకుండా సాధిస్తామని, సీఎం ఎవరనేది గెలిచిన ఎమ్మెల్యేలు, అధిష్టానం నిర్ణయిస్తారని చెప్పారు.

- Advertisement -
   

డీకే శివకుమార్‌లా పదవిని త్యాగం చేసే గుణం అందరిలో ఉండాలంటూ సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సీట్లను ఖచ్చితంగా గెలుస్తామంటూ రేణుకా చౌదరి పేర్కొన్నారు. ఏపీలో నేను పోటీ చేయాలని, ప్రచారం చేయాలని ఆహ్వానం ఉంది.. ఏపిలో నరకం అనుభవిస్తున్నారు.. విభజన జరిగినా సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. చంద్రబాబు అరెస్ట్ తీరు సరిగా లేదు..అంత అవసరమా.. అంటూ ప్రశ్నించారు. ఏపీ సీఎం ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకి అనేది అందరికీ తెలుసంటూ పేర్కొన్నారు. ఇక్కడ తెలుగుదేశం పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఎఫెక్టు పడిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement