Tuesday, April 30, 2024

మే 31 నుంచి అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు

హైదరాబాద్ డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2016, అంతకు ముందు డిగ్రీ బ్యాచ్ విద్యార్థులకు మే 31 నుంచి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా.పి.వెంకట రమణ మంగళవారం తెలిపారు. మే 31 నుంచి జూన్ 5వరకు మూడో ఏడాది పరీక్షలు, జూన్ 7 నుంచి 14 వరకు రెండో ఏడాది పరీక్షలు, జూన్ 16 నుంచి 19 వరకు మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు విశ్వవిద్యాలయం పోర్టల్ www.braouonline.in లో పేర్లు నమోదు చేసుకోవాలని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు మే 10 చివరి తేదీ అని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం కాల్ సెంటర్ 18005990101, హెల్ప్ డెస్క్ 7382929570 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement