Monday, May 6, 2024

ఐటికి మాద్యం దెబ్బ – త్రిశంకు స్వ‌ర్గంలో క్యాంప‌స్ రిక్రూటీస్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రపంచ వ్యాప్తం గా ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం తెలుగు రాష్ట్రాల్లో చదువు తున్న ఇంజనీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మాంద్యం నేపథ్యంలో బహుళజాతి సంస్థలు తమ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో పెద్ద ఎత్తున ఐటీ- నిపుణులను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టగా కొన్ని సంస్థలు ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారి జీత భత్యాల్లో భారీగా కోత విధిస్తున్న సంగతి తెలిసిందే. పేరొందిన ఐటీ- సంస్థలకు రావలసిన కొత్త ప్రాజెక్టులు ఆగిపోవ డంతో ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ -టె-క్నాలజీ (నిట్‌) రాష్ట్ర స్థాయిలో ప్రైవేట్‌, డీవ్డ్‌ు విశ్వ విద్యాలయాలు, ఇంజనీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యా కళాశాలల్లో ప్రాంగణ నియామ కాలు (క్యాంపస్‌ ఇంటర్వ్యూలు) పూర్తిగా నిలిచిపోయా యి. దీంతో ఏపీలోని విద్యా సంస్థల్లో చివరి సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌ అంధకారంలో పడిపోయింది. అమెరికా కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, జర్మనీ వంటి దేశాలకు వెళ్లి మాస్టర్స్‌ (ఎంఎస్‌) చదివే ఆర్థిక స్థోమత లేక ఇక్కడ ఉద్యోగం వస్తుందో లేదో తెలియక తల్లడిల్లిపోతున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల భవిష్యత్‌ ఏమవుతుందోనని తలలు పట్టు-కుని లబోదిబోమంటు-న్నారు. పేరొందిన ఐటీ-, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సంస్థలు గత విద్యా సంవత్సరం (2021-22) ఎంపిక చేసుకున్న విద్యా సంస్థలు, కళాశాలలకు వెళ్లి పెద్ద ఎత్తున ప్రాంగణ నియామకాలు చేపట్టాయి. ఆయా కళాశాలలు, వర్సిటీ-ల అధికారులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఏపీలోని జేఎన్‌టీయూ, ఆంధ్రా, నాగార్జున, యోగి వేమన తదితర విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఫస్ట్‌, లాస్ట్‌ సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులకు కంపెనీల ప్రతినిధులు మౌఖిక ఇంటర్వ్యూలు నిర్వహించి ముప్పయి వేల మందికి పైగా విద్యార్థులను ఎంపిక చేసి ఆఫర్‌ లెటర్లు జారీ చేసినట్టు- సమాచారం.

ఏపీకి చెందిన దాదాపు 10వేల మంది విద్యార్థులకు, తెలంగాణాలోని హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని వివిధ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఆఫర్‌ లెటర్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్‌ పూర్తయిన వెంటనే ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరి విధులు నిర్వహించాలని కోరింది. అయితే వార్షిక పరీక్షలు పూర్తయి ఫలితాలు వచ్చినా ఉద్యోగాలు ఇస్తానన్న కంపెనీల నుంచి ఉలుకు.. పలుకు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్టు- తెలుస్తోంది. ఆఫర్‌ లెటర్లు ఇచ్చిన సంస్థల నుంచి స్పందన కరవవడంతో తమ పిల్లలు ఏమైపోతారోనన్న ఆందోళన చెందుతున్నామని తల్లిదండ్రులు, కుటు-ంబ సభ్యులు చెబుతున్నారు. ఆఫర్‌ లెటర్లు జారీ చేసిన కంపెనీల దగ్గరకు వెళ్లి వాకబు చేస్తే స్పష్టమైన సమాధానం రావడం లేదని, కొన్ని కంపెనీల యాజమాన్యాలు మాత్రం పరిస్థితి మెరుగుపడ్డాక కబురు చేస్తామని మాత్రమే అంటు-న్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి బహుళజాతి, పేరొందిన సంస్థలు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి ఆఫర్‌ లెటర్లు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. కోవిడ్‌ తర్వాత ప్రాంగణ నియామకాలు మందగించాయని, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఐటీ- రంగాన్ని పట్టి పీడిస్తోందని యజమాన్యాలంటు-న్నాయి.
ఏటా 40 వేల మందికి ఉపాధి
రాష్ట్రంలో ప్రతి విద్యా సంవత్సరం ఇంజనీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏతో పాటు- ఇతర వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు రెండు లక్షలకు పైగా ఉంటారని, ఇందులో 30 వేల మంది ఆయా దేశాలకు వెళ్లి మాస్టర్స్‌ చదువుతుండగా 40 నుంచి యాబై వేల మంది యువతీయువకులు స్థానికంగా ఉన్న ఐటీ-, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ ఇతర సంస్థల్లో ఉపాధి పొందుతున్నట్టు- సమాచారం. మరో పదివేల మంది ఇక్కడే ఎం-టె-క్‌, పీహెచ్‌డీ తదితర ఉన్నత చదువుల్లో ప్రవేశం పొందుతుతున్నట్టు- గణాంకాలు చెబుతున్నాయి.
రెండేళ్లు ఇంతే!
ఆర్థిక మాంద్యం మరో రెండు సంవత్సరాలు పట్టి పీడించే అవకాశం ఉందని ఆయా రంగాలకు చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పేరొందిన ఐటీ-, ఫార్మా, ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ సంస్థలకు వచ్చే భారీ ప్రాజెక్టులు ఆగిపోవడంతో ఆయా కంపెనీలు ఉద్యోగులను తొలగించడం, జీతభత్యాల్లో కోత విధించడం వంటి చర్యలకు దిగుతున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టులు లేకపోవడం మూలంగానే క్యాంపస్‌ ఇంటర్వ్యూలను కంపెనీలు నిర్వహిండం లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆఫర్‌ లెటర్లు అందుకున్న యువతీయువకులను ఉదోగాల్లో చేర్చుకోవడంలేదని చెబుతున్నారు. కరోనా తర్వాత అమెరికాలో ఆర్థిక పరిస్థితి దిగజారిందని, అక్కడి ఐటీ- సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. అమెరికాలో ఐటీ- సంస్థలకు ప్రాజెక్టులు ఆగిపోవడంతోనే ఆ ప్రభావం ప్రాంగణ నియామకాలపై పడిందని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement