Monday, December 9, 2024

నేడు సీఎం కేసీఆర్ తో కేర‌ళ సీఎం విజ‌య‌న్ భేటీ

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. సీపీఎం జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు హైద‌రాబాద్ లో జ‌రుగుతున్నాయి. ఈనేప‌థ్యంలో ఆయ‌న హైద‌రాబాద్ కు వ‌చ్చారు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కానున్నారు. సీఎం కేసీఆర్ ను పిన‌ర‌యి విజ‌య‌న్ క‌ల‌వాల‌ని భావించి అపాయింట్ మెంట్ ను కోరారు. అయితే కేసీఆర్ పినరయి విజయన్ ను మాత్రమే కాకుండా సెంట్రల్ కమిటీ సభ్యులందరినీ డిన్నర్ కు ఆహ్వానించారు. పినరయి విజయన్ సీఎం కేసీఆర్ ను కలవ‌నున్నారు. అయితే సెంట్రల్ కమిటీ సభ్యులు కేసీఆర్ ఏర్పాటు చేసిన డిన్నర్ కు వెళ్లాలా? లేదా? అన్న దానిపై నిర్ణయం తీసుకోలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement