Saturday, May 4, 2024

KCR : ఢిల్లీలోని అధికార నివాసాన్నిఖాళీ చేయనున్నకేసీఆర్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ లో ఉన్న అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అధికారిక నివాసాలను కేటాయిస్తుంది. ఈ క్రమంలో సీఎంగా ఉన్న కేసీఆర్ కు కేంద్రం అదే నివాసాన్ని కేటాయించింది.

ఆ తర్వాత ఎంపీగా గెలుపొందిన కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఆ నివాసంలోనే ఉన్నారు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందడంతో సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అధికార నివాసాన్ని కేసీఆర్ ఖాళీ చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement