Sunday, April 28, 2024

KCR – తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సిఎం కెసిఆర్ బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు…

హైదరాబాద్‌, : తెలంగాణ పూలపండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు ‘సద్దుల బతుకమ్మ’ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానం నుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అని సీఎం అన్నారు. దేవీదేవతలను అర్చించే పువ్వులే బతుకమ్మగా పూజలందుకోవటం తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధన, కృతజ్ఞతాభావనను తెలియజేస్తాయని చెప్పారు.

సబ్బండ వర్గాలు సమిష్ఠిగా జరుపుకొనే బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనదని తెలిపారు. పచ్చదనం, పాడి పంటలు, పశుసంపద, ప్రకృతి వనరుల సమృద్ధితో నేడు తెలంగాణ నిండైన బతుకమ్మను తలపిస్తున్నదని వెల్లడించారు. బతుకమ్మల నిమజ్జన సమయంలో స్వీయ జాగ్రత్తలు, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఆనందోత్సాహాలతో సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని జగన్మాత గౌరీదేవిని ప్రార్థించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement