Tuesday, May 7, 2024

యూత్ ఐకాన్ కేటీఆర్.. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ యూత్ ఐకాన్ అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జండా చౌరస్తాలో కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేసిన ఘనత కేటీఆర్ కే దక్కుతుందన్నారు. కేటీఆర్ చొరవ వల్లే రాష్ట్రంలో ఐటి పురోగతి చెందిందన్నారు.

మల్టీ నేషనల్ కంపెనీల పెట్టుబడులు రాష్ట్రానికి తేవడంలో సఫలీకృతులయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement