Wednesday, May 8, 2024

11 మంది త‌హ‌సీల్దార్ ల బదిలీ

కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న 11 మంది త‌హ‌సీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ కర్ణన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న కనకయ్యను కలెక్టరేట్ జి సూపరిండెంట్ గా, బావ్ సింగ్ ను గన్నేరువరంకు, నారాయణను కలెక్టరేట్ ఏవోగా, కరెక్ట్ ఏవోగా పనిచేస్తున్న లక్ష్మారెడ్డిని మానకొండూరుకు, మాధవిని ఇల్లందకుంటకు, ఈ సూపరిండెంట్ పని చేస్తున్న శ్రీవాణిని తిమ్మాపూర్ కు, గన్నేరువరం తహ‌సీల్దార్ గా పనిచేస్తున్న రాజేశ్వరిని జమ్మికుంటకు, ఇల్లందకుంట తహసీల్దార్ గా పని చేస్తున్న సురేఖను కలెక్టరేట్ ఈ సూపరిండెంట్‌ గా, మనకొండుర్ త‌హ‌సీల్దార్ రాజయ్యను వీనవంకకు, తిమ్మాపూర్ త‌హ‌సీల్దార్ రాజకుమార్ ను రామడుగుకు, త‌హ‌సీల్దార్ కోమల్ రెడ్డిని హుజురాబాద్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement