Sunday, May 19, 2024

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి : కలెక్టర్ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి రూరల్ : మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ పిలుపునిచ్చారు. మహాకవి వాల్మీకి జయంతి పురస్కరించుకొని ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ తో కలిసి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఆనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వాల్మీకి హైందవ ధర్మానికి అతి ముఖ్యమైన గ్రంథం రామాయణాన్ని రచించారని, రామాయణ గ్రంథం ద్వారా అనేక విలువలను సమాజానికి అందించారని కలెక్టర్ పేర్కొన్నారు. వాల్మీకి రచించిన రామాయణం కారణంగానే మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందని కలెక్టర్ తెలిపారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వసుదైక కుటుంబం అనే భావన రామాయణంతో ముడిబడి ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జె. రంగారెడ్డి, ఈడిఎస్ సీ కార్పోరేషన్ మధుసూధనశర్మ, జిల్లా ఫిషరీస్ అధికారి భాస్కర్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement