Monday, May 13, 2024

సింగరేణియులంటే కేసీఆర్ కు అమితమైన అభిమానం.. ఎమ్మెల్యే కోరుకంటి

సింగరేణి కార్మికులంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు అమితమైన అభిమానమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.8వ కాలనీ సి.ఈ.ఆర్ క్లబ్ లో జరిగిన టీబీజీకేఎస్ జనరల్ బాడి సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు బి.వెంకట్రావ్ యు‍నియన్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య కలిసి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల పాత హక్కులను కాపాడటంతో పాటు కోల్ ఇండియాకు ధీటుగా అరవైకి పైగా హక్కులను సాధించిన ఘనత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీబీజీకేఎస్ యూనియన్ దన్నారు. సింగరేణిలో తాము చేస్తున్న కృషిని జీర్ణించుకోలేక జాతీయ సంఘాలు గనులపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. జాతీయ సంఘాలు తప్పుడు ప్రచారాలను నమ్మితే సింగరేణి భవిష్యత్ అంధకారమేనన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకెఎస్ యూనియన్ గెలుపే లక్ష్యంగా మనందరం పనిచేయాలని పిలుపునిచ్చారు. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవితక్క టిబిజికేఏస్ యుానియన్ అండగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కల్వకుంట్ల కవిత నాయకత్వంలో అనేక హక్కులను సాధించడం జరిగిందన్నారు.


తెలంగాణ ఇంక్రిమెంటు, సమ్మెకాలపు వేతనాలు, మ్యాచింగ్ గ్రాంటు, రెండు ఆదనపు పీహెచీలు, తల్లిదండ్రులకు కార్పోరేట్ వైద్యం తదితర అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. గతంలో జాతీయ సంఘాలు పొగొట్టిన వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియమాకాల ద్వారా తిరిగి అమలుచేసి కార్మికుల వారసుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయులు సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ సమావేశంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్ ఉపాధ్యాక్షుడు ఐలి శ్రీనివాస్ నాయకులు కొత్త సత్యనారాయణ రెడ్డి, చెరుకు ప్రభాకర్ రెడ్డి, బాదావత్ శంకర్ నాయక్, దేవ వెంకటేశం, ఎ.కృష్ణ, ఐ.సత్యం, సయ్యద్ హమీద్, బేతి చంద్రయ్య, అవునూరి రాజేశం, బానాకర్, ధరణి మల్లేశ్వర్రావు, కర్క శ్రీనివాస్, అమ్మిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాచగోని దశరథమ్ గౌడ్, ఆకుల రాజిరెడ్డి, ముస్కుల అనిల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ప్యారేమియా, మల్లికార్జున్, మేడి సదయ్య, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement