Sunday, May 5, 2024

రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి.. జిల్లా కలెక్టర్ సంగీత

పెద్దపల్లి (ప్ర‌భ న్యూస్‌) : కరీంనగర్ గోదావరిఖని రహదారికి ఇరువైపులా ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. కరీంనగర్ గోదావరిఖని రహదారి వెంబడి నాటిన మొక్కలను అప్పన్నపేట వద్ద కలెక్టర్ శనివారం పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా ప్రారంభంనుంచి గోదావరిఖని వరకు రాష్ట్ర రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించి, వంగిపోయిన మొక్కల స్థానంలో నూతన మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు.

రహదారి వెంబడి మీడియం పై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, నూతన మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశించారు. దీనికి సంబంధించిన పనులు రెండు రోజులుగా ముమ్మరంగా జరుగుతున్నాయని, ఆగస్టు 21న హరితహారం కార్యక్రమం కింద రహదారి వెంబడి పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకున్నామని గ్రామీణ అభివృద్ధి అధికారి కలెక్టర్ కు నివేదించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, పెద్దపల్లి ఎంపిడిఓ రాజు, సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement