Friday, April 26, 2024

ఆర్జీ3లో 80శాతం బొగ్గు ఉత్పత్తి..

రామగిరి: ఆర్జీ3 ఏరియా పరిధిలో ఏప్రిల్‌ నెలలో 80శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం మనోహర్‌ వెల్లడించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓపెన్‌ కాస్టు-1 గని 2.2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికిగాను 2.10 లక్షల టన్నుల ఉత్పత్తితో 95శాతం, ఓపెన్‌కాస్టు-2 గని 3.0లక్షల టన్నులకుగాను 2.08 లక్షల టన్నుల ఉత్పత్తితో 69శాతం మొత్తం 5.20లక్షల టన్నులకుగాను 4.18తో 80శాతం ఉత్పత్తి సాధించినట్లు వివరించారు. ఉద్పాదకత 9.09 ఆఫ్‌ లోడింగ్‌ ఓబీ 76శాతం, సింగరేణి ఓబీ 90శాతం సాధించామని, ఓసీ1 సీహెచ్‌పీ నుంచి ఏప్రిల్‌ నెలలో 6.94లక్షల బొగ్గు రవాణా అయ్యిందన్నారు. అలాగే కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, అధికారులు, ఉద్యోగులు, కార్మికుల రక్షణ కోసం యాజమాన్యం కృషి చేస్తుందన్నారు. మాస్కులు, శానిటైజర్లతోపాటు క్వారంటైన్‌ కేంద్రాన్ని అందుబాటులో ఉంచామన్నారు. అలాగే ఏప్రిల్‌ 30వరకు సెంటినరీకాలనీ డిస్పెన్సరీలో 1537 మందికి కోవిడ్‌ టీకాలు వేశామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement