Monday, May 6, 2024

అందరి సహాకారంతో ఆలయ పునరుద్దరణ… పోలీస్ హౌసింగ్ చైర్మన్ కోలేటి

పెద్దపల్లి రూరల్ : అందరి సహాకారంతో ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తవుతున్నట్లు రాష్ట్ర పోలీస్ హోసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. పెద్దపల్లి మండలం రాగినెడులో నిర్మిస్తున్న శివాలయం నిర్మాణ పనులను ఈరోజు ఆయన ఇండోమెంట్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ… ఆలయ నిర్మాణానికి నిధులు విడుదలకు సీఎం కేసీఆర్ చొరవకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధతో శరవేగంగా ఆలయ నిర్మాణం పనులు నిర్వహిస్తున్నారని అభినందించారు.

వచ్చే సెప్టెంబర్ నాటికి నూతన శివాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రాగినెడులో ఆధునిక, ఆలయ వైభవాలు ఉట్టిపడేలా శివాలయం నిర్మాణానికి ప్రత్యేక చొరవతో కృషిచేస్తున్న దామోదర్ కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తపస్ వళ్ళి నాయగం, దేవాదాయ శాఖ ఎస్ఈ మల్లిఖార్జున్ రెడ్డి, కాంట్రాక్టర్ పాండు, సర్పంచ్ మల్క రేవతి కుమారస్వామి, ఎంపీటీసీ పిప్పాల నిర్మల శ్రీనివాస్, భూదాత పోతురాజుల భూమయ్య, గ్రామస్తులు పడాల సత్యనారాయణ, బుర్ర అంజన్న, కట్ల కనకయ్య, పడాల జగన్నాధం, పడాల తిరుపతి, మల్క మధు, తాళ్ల లక్ష్మన్, ఇల్లందుల అంజిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement