వేములవాడ: దక్షిణ కాశీగా విరాజిల్లు తున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని టీపీసీసీ కార్యదర్శి, రాజన్న ఆలయ ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా కరోనా మహమ్మారి కారణంగా ప్రజలంతా ఇబ్బందికర వాతావరణంలో ఉన్నారని, రాబోయే సంవత్సరం ప్రజలు, ప్రకృతి సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లుగా శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రగిరి శ్రీనివాస్, సాగరం వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లోక కళ్యాణం కోసం ప్రత్యేక పూజలు..

Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement