Wednesday, May 29, 2024

మోడీ వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసనలు : ప్రధాని దిష్టిబొమ్మ దహనం

తెలంగాణ రాష్ట్ర విభజనపై పార్లమెంట్ లో నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నల్లజెండాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బుధవారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు నల్ల జెండాలు చేతబూని మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ… రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు గడిచినా ప్రధానికి తెలంగాణపై అక్కసు పోలేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి నిధులు కేటాయించకుండా రాష్ట్రంపై చిన్నచూపు చూస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రధాని దెబ్బతీయడం సిగ్గుచేటన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement