Thursday, May 2, 2024

భారత్‌ ఆత్మగౌరవం దెబ్బతీసింది.. క్షమాపణ చెప్పాల్సిందే.. హ్యుందాయ్‌పై పీయూష్‌ గుస్సా..

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ వ్యవహార శైలి అస్సలు బాగాలేదని, బేషరతుగా భారతీయులకు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తేల్చి చెప్పారు. కాశ్మీర్‌పై చేసిన వివాదాస్పద టీట్‌పై రాజ్యసభలో మంగళవారం చర్చ జరిగింది. దీనిపై పీయూష్‌ గోయల్‌ స్పందించారు. కాశ్మీర్‌ అనేది భారత్‌లో భూభాగమని, ఇది ఎప్పటికీ ఉంటుందని, అలాంటిది.. హ్యుందాయ్‌ కంపెనీ భారతీయుల ఆత్మ గౌరవాన్ని కించపర్చేలా వ్యవహరించిందని మండిపడ్డారు. క్షమాపణలకు సంబంధించిన డిమాండ్‌లో ఎలాంటి తప్పు లేదని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని భారత్‌, దక్షిణ కొరియా ప్రభుతాల మధ్య జరిగిందని, ఇరు దేశాల కంపెనీలకు ఈ విషయమై వివరణ కోరినట్టు తెలిపారు.

స్పష్టమైన రీతిలో క్షమాపణ చెప్పేందుకు తాము డిమాండ్‌ చేస్తున్నామని గోయల్‌ చెప్పుకొచ్చారు. శివసేన ఎంపీ ప్రియాంక చతురేది కూడా హ్యుందాయ్‌ కంపెనీపై నిప్పులు చెరిగారు. కంపెనీ చేసిన టీట్‌.. కాశ్మీర్‌ స్వేచ్ఛను కోరేలా ఉందన్నారు. హ్యుందాయ్‌ అనే కంపెనీ పేరును ప్రస్తావించకుండా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కియా మోటార్స్‌ కూడా ఈ తరహాలోనే టీట్‌ చేసిందని, హ్యుందాయ్‌ టీట్‌ వివాదాస్పదం కావడంతో కియా జాగ్రత్తపడి తొలగించిందని వివరించారు. వ్యాపార పరంగా ఇరు దేశాల్లో కంపెనీలు సంపాదిస్తున్నాయని, కానీ భౌగోళికంగా మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాయని మండిపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement