Thursday, February 2, 2023

ఖమ్మంకు తరలిన గులాబీ దండు

భారత రాష్ట్ర సమితి తొలి బహిరంగ సభ కోసం పెద్దపల్లి గులాబీ దండు ఖమ్మంకు తరలివెళ్లారు. బుధవారం పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఖమ్మంకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ… ఖమ్మం సభతో దేశ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవని, దేశ ప్రజలందరూ బీఆర్ఎస్ ను ఆదరిస్తే తెలంగాణ పథకాలు దేశమంతా అమలవుతాయన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement