Tuesday, May 14, 2024

ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి : మంత్రి గంగుల

భారత స్వాత్యంత్ర్య సిద్దించి 75 వసంతాలను పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా నిర్వహించుకుంటున్న వజ్రోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం కరీంనగర్ కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ దేశం గర్వింగేలా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అన్నారు. గడిచిన 75 సంవత్సరాలలో మనదేశం ఎంతో పురోగతిని సాధించిందని అన్నారు. భారత కీర్తి పతాకా దశ దిశల వ్యాప్తి చెందేల అగస్టు 8 నుండి 15 రోజుల పాటు వజ్రోత్సవాలను కుల, మతాలకు అతీతంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

జిల్లాలో 3,08,754 గృహలను గుర్తించడం జరిగిందని, కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లోని 79,953 గృహాలలో ప్రతి ఇంటి పై జెండా రెపరేపాలాడాలని, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలన్నారు. 75 సంవత్సరాల దేశాభివృద్దిని, దేశ పురోగతిని, దేశభక్తిని భావితరానికి చాటిచెప్పెలా చూడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. దేశ పౌరుడిగా ప్రతి ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజాప్రతినిధులకు, అధికారులకు జాతీయజెండాను అందజేశారు. అనంతరం మంత్రి, జిల్లా కలెక్టర్, మేయర్ సిపిలతో కలిసి పట్టణంలోని భగత్ నగర్ లో ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి జాతీయ జెండాను ఇంటింటికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి,పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, జిల్లా అధికారులు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement