Thursday, May 16, 2024

నిరుపేద విద్యార్థికి ఎమ్మెల్యే చేయూత‌

నిరుపేద విద్యార్థిని వైద్య విద్య కోసం పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆర్థిక చేయూత అందించేందుకు ముందుకు వచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నరసయ్య పల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి భవాని మెదక్ జిల్లాలోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందింది. సోమవారం కుటుంబ సభ్యులు భవాని వైద్య విద్య కోసం సహాయం చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోరగా… ఏడాదికి 20 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తానని ఎమ్మెల్యే దాసరి హామీ ఇచ్చారు. భవాని కుటుంబం సభ్యులు ఎమ్మెల్యే దాసరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement