Saturday, May 4, 2024

11న మెగా జాబ్ మేళా.. సిపి సుబ్బారాయుడు

కరీంనగర్ కమీషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో ఈనెల 11న మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమీషనర్ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. గురువారం కమీషనరేట్ ఆవరణలో మెగా జాబ్ మేళా గోడ పత్రికను ఆవిష్కరించారు. జాబ్ మేళా గీతాభవన్ చౌరస్తా సమీపంలోని పద్మనాయక కళ్యాణమండపం ఆవరణలో నిర్వహించనున్నట్లు చెప్పారు. పదవ తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, పీజీ, ఫార్మసి, బిటెక్, యంటెక్, యంబిఏ, యంసిఏ చదివిన అభ్యర్థులు దాదాపు 4వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. విప్రో, జెన్ ప్యాక్, టాటా సర్వీసెస్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ, ఇండిగో ఎయిర్ లైన్స్, గూగుల్ పే, రిలయన్స్ జియో కంపెనీలతో పాటు దాదాపు 100కు పైగా ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అనంతరం నియామక పత్రాలు అందజేస్తారని చెప్పారు. ట్రాన్స్ జెండర్ వర్గానికి చెందిన వారికి కూడా ఇందులో అవకాశాలను కల్పించనున్నామని తెలిపారు.


ఆసక్తి గల అభ్యర్థులు పైన పేర్కొన్న విద్యార్హతలు ఉన్నవారు సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, రెండు పాస్ పోర్టు సైజు ఫోటోలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ జాబ్ మేళా ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఆర్ఎస్ఐలు మహేష్ 9652169877, తిరుపతి 6301955823 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి శ్రీనివాస్, ఏసిపిలు తుల శ్రీనివాసరావు, ప్రతాప్, ఇన్స్ పెక్టర్లు సిహెచ్ నటేష్, లక్ష్మీబాబు, దామోదర్ రెడ్డి, ఆర్ఐలు మల్లేశం, జానీమియా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement