Thursday, April 25, 2024

మీ వాటాల ఒప్పందం కుదరకపోతే పేదలను ఇబ్బంది పెడతారా : సీపీఐ నేత నారాయణ

తిరుపతి సిటీ ఏప్రిల్ 6 (ప్రభ న్యూస్) : చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూ హక్కుదారులు తమ నివేశన స్థలాలలో ఇండ్లు నిర్మించుకుంటే సిపిఐ, సిపిఎంగా మేము అండగా ఉంటామని శెట్టిపల్లి భూ బాధితులకు సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ భరోసా ఇచ్చారు. గురువారం తిరుపతి అర్బన్ శెట్టిపల్లి గ్రామపంచాయతీ భూ బాధితుల భూముల ను ఆయన స్వయంగా భూమి మొత్తం తిరిగి పరిశీలించారు. సీపీఐ సీపీఎం నాయుకులు, కార్యకర్తలు, భూ బాధితులు పెద్ద సంఖ్యలో నారాయణ వెంట నడిచి సమస్యలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. శెట్టిపల్లి కి చెందిన రైతులు నిరుపేదలు చెందిన భూములు మీ అబ్బ సొత్తు లబ్ధిదారులకు పంచడానికి మీరెవరు ప్రభుత్వానికి ఏమి హక్కు ఉందని ఆయన మండిపడ్డారు. రెవెన్యూ పోలీసులు లబ్ధిదారులకు సహాయపడకుండా బినామీ దారులకు వత్తాసు పలుకుతూ కోట్లాది రూపాయలు దోచుకోవాలని పేదవాడి నోట్లో మట్టిపడుతున్నారని, పేదల రక్తం మాంసాలతో భక్షించవద్దని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు నాయుడు ల్యాండ్ పోలింగ్ పేరుతో 500 ఎకరాలు ప్రజా అవసరాల కోసం తీసుకొని వాటిని సక్రమంగా ఉపయోగించకుండా ఆయన అధికారంలో నుంచి తప్పుకుంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి శెట్టిపల్లికి వచ్చి మీ భూములన్ని మీకే అప్పగిస్తాం అని మాట ఇచ్చి, నేడు మాట తప్పిన జగన్మోహన్ రెడ్డిగా నిలబడిపోయాడని, ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేల వాటా పంపకాలలో తేడాల వల్ల నిరుపేద భూహక్కుదారులు నిలువునా మోసపోతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ భూమిని ఎమ్మెల్యేలు పంచుకొనే హక్కు ఎవరిచ్చారు అని ప్రశ్నించారు . ప్రతి పేదవాడు భూమిలో ఇల్లు నిర్మించుకుంటారని నిర్మించుకున్న ఇళ్లకు అవసరమైన మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పేదల భూములు బలవంతంగా లాక్కొని వారికి న్యాయం చేయకుండా కాలయాపన చేయడం జగన్మోహన్ రెడ్డికి తగదని తక్షణమే సమస్యను పరిష్కరించే దిశగా ఎవరి స్థలాలలో వారు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాలని లేని పక్షంలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో మేమే దగ్గరుండి పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి శత్రువు అని అలాంటి బిజెపి పంచన చేరడం పవన్ కళ్యాణ్ కు మంచిది కాదని ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జనసేన టిడిపి కలిసి ఉంటే మంచిదని అలా కాకుండా మూడు కలవాలని అనుకుంటే అది మొదటికే మోసం జరుగుతుందన్నారు. పవన్ కళ్యాణ్ గట్టిగా కష్టపడుతున్నాడు గాని సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడని ఆయన పవన్ కళ్యాణ్ కు చురక అంటించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాద్ రెడ్డి. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కే రాధాకృష్ణ, జల్లా విశ్వనాథ్, బి నదియా, ఉదయ్ కుమార్, బండి చలపతి, సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు ఎన్డి రవి, ఎన్ శివా, కే వై రాజా, కే. పద్మనాభ రెడ్డి, సి హెచ్ శివ కుమార్, మోహన్ రెడ్డి , ఎంవియస్ మూర్తీ, జె.నాగరాజు, వై ఎస్ మణి, భూ బాధితుల సంఘం నాయుకులు క్రిష్ణ , డప్పు సూరి, రాధాకృష్ణ, భాదితులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement