Saturday, April 10, 2021

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

ఇల్లంతకుంట: రాష్ట్రంలోని క్షౌర వృత్తి శాలలకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించిన సందర్భంగా సోమవారం మండలంలోని పెద్దలింగాపూర్‌ గ్రామంలో నాయి బ్రాహ్మణులు సీఎం, ఎమ్మెల్యే రసమయి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గొడిశెల జితెందర్‌ గౌడ్‌, ఎంపీటీసీ కరివెద స్వప్న కర్ణాకర్‌రెడ్డి, మండల మార్కెట్‌ కమిటి డైరెక్టర్‌ మీసరగండ్ల అనిల్‌ కుమార్‌, ఉపసర్పంచ్‌ కుమార్‌, తెరాస గ్రామశాఖ అధ్యక్షులు పసుల బాబు, దళిత సంఘాల జిల్లా అధ్యక్షుడు పసుల బాల్‌ రాజ్‌, అంభేడ్కర్‌ సంఘం అధ్యక్షులు మాంకాలి శ్రీను, బొప్ప శ్రీనివాస్‌, ల్యాగల బాగయ్య, నాయి బ్రాహ్మణ అధ్యక్షులు మొలంకుల బాలయ్య, సభ్యులు బాలనర్సు, శంకర్‌, వెంకట్‌, శ్రీనివాస్‌, కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News