Saturday, April 10, 2021

సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం..

కోరుట్ల ‌: మండలంలోని ఐలపూర్‌ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి రజక సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. రజకులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తామని సీఎం ప్రకటన చేయడం పట్ల రజకులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రాధ సందయ్య, ఉప సర్పంచ్‌ అంజమ్మ శంకర్‌, ఎంపీటీ-సీ గంగాధర్‌, టీ-ఆరెస్‌ నాయకులు గంగాధర్‌, వెంకటస్వామి, తుక్కరెడ్డి, నరేందర్‌ రెడ్డి, అంజిరెడ్డి, లక్షారెడ్డి, శేఖర్‌రెడ్డి, రాజారెడ్డి, మహిపాల్‌, రజక సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News