Tuesday, April 23, 2024

అర్హులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు..

గోదావరిఖని: తెలంగాణ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలందరికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు అందించాలని కోరుతూ ఫైట్‌ ఫర్‌ బెటర్‌ సొసైటీ- నాయకులు రామగుండం తహశీల్దార్‌ రమేష్‌కి వినతి పత్రం అందించారు. ఈసందర్భంగా అధ్యక్షులు మద్దెల దినేష్‌, ఉపాధ్యక్షులు మాదిరెడ్డి నాగారాజు మాట్లాడుతూ పేద కుటుంబాలను ఆదుకునేందుకు తొలిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళు నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. 2015-16లో పథకం ప్రారంభిస్తే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికి డబుల్‌ బెడ్‌రూం గృహాలపై నిర్లక్ష్యం కొనసాగుతుందన్నారు. ఇప్పటికైనా దళారుల, రాజకీయ నాయకుల జోక్యం లేకుండా కలెక్టర్‌, అధికారులు అర్హులైన వారికి కేటాయించాలని కోరారు. అలాగే దే విధంగా అర్హులైన వారికి రేషన్‌ కార్డులు కూడా అందించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement