Friday, March 31, 2023

ఆడబిడ్డల పెళ్లిళ్లకు భరోసా కళ్యాణలక్ష్మి : ఎమ్మెల్యే దాసరి

ఎలిగేడు : నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి పథకం ఆర్థికంగా భరోసా ఇస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎలిగేడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. పేద ప్రజలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారన్నారు.

- Advertisement -
   

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఎంతో అండగా నిలుస్తున్నాయని, తల్లిదండ్రులకు ఆర్థికభారం తగ్గిస్తున్నాయన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్‌ రావు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ మండిగా రెణుక రాజనర్సు, సర్పంచ్ ల‌ ఫోరం అధ్యక్షుడు కొండల్‌ రెడ్డి, సర్పంచులు సింధుజా, కొండయ్య రాజా, ఐలయ్య, సింగిరెడ్డి రాజవ్వ, గోల్లె కావేరి భూమేష్‌, వెంకటేశ్వరరావు, ఎంపీటీసీలు సావిత్రమ్మ, కొత్తిరెడ్డి ప్రేమలత, తూడి లక్ష్మి బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, నాయకులు సుధాకర్‌ రావు, న్యాతరి పోశాలు, రాజేశం, తిరుపతి రెడ్డి, సమ్మయ్య, వినోద్‌, అనిల్‌, వెంకటేష్‌, తిరుపతి, సంపత్‌, శ్రావణ్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement