Sunday, April 28, 2024

గో మహాగర్జన..

సుల్తానాబాద్‌: ఏప్రిల్‌ 1న హైదరాబాద్‌ నగరంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగే గో మహాగర్జన పోస్టర్లను పట్టణంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ యువతులసి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని గో హత్యలు ఆపాలని భారీ బహిరంగ సభను హిందూ బంధువులు, గో సంరక్షకులు, గోవు ప్రేమించే వారు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గోవును జాతీయ ప్రాణిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ప్రకటించాలన్నారు. ఈ సభకు త్రిదండి చిన్న జీయర్‌స్వామి, పీఠాధిపతులు పాల్గొంటారని తెలిపారు. ఈకార్యక్రమంలో పురోహితులు గూడ రమేష్‌శర్మ, మాజీ వార్డు సభ్యురాలు కొండ రజిత, కామని రాజేంద్రప్రసాద్‌, శ్రీ ధర్మశాస్త్ర గోశాల బండారి సూర్య, దొడ్ల దేవేందర్‌, శెట్టి శ్రీనివాస్‌, తుమ్మ నిశాంత్‌, కొప్పుల గోపీ, నల్ల రామస్వామి, కొండ శ్రీధర్‌, నల్ల రాజమొగిలి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement