Saturday, April 20, 2024

వెంకన్నకు తలనీలాలు.. స్మగ్లర్లకు కాసులు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఆ స్వామికి భక్తితో తమ తలనీలాలు సమర్పించుకుంటారు. భక్తులు సమర్పించిన ఈ తలనీలాల ద్వారా వందల కోట్ల ఆదాయం సమకూరుతుంది. తిరుమలలో తలనీలాలు ఇవ్వడం.. ప్రతి భక్తుడు పవిత్రంగా భావిస్తారు. అయితే మయన్మార్, చైనా వంటి దేశాలకు శుద్ధి చేయని మానవ కేశాల అక్రమ రవాణా భారత్ నుంచి జోరుగా సాగుతున్నది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తలనీలాలు స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. మిజోరాం సరిహద్దులో అస్సాం‌ విభాగం పోలీసులకు చిక్కారు. చైనాకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. మొత్తం రెండు ట్రక్కులలో 120 బస్తాల వెంట్రుకలు దొరికాయి. వీటి విలువ రెండు కోట్లు ఉంటుందని అంచన వాటిపై అధికారులు దర్యాప్తు చేస్తోంది.

ప్రపంచంలో జపాన్, ఆఫ్రికా దేశాలలో తల నీలాలకు మంచి గిరాకి ఉంది. మన దేశంలో చెన్నై, బెంగళూరు, ఆంధ్రా ప్రాంత నగరాలలో విదేశీ వ్యాపారస్థులు ఆఫీసులు తెరిచి దేవాలయాలు మొదలు- బార్బర్ సెలూన్ల దాకా తిరిగి వెంట్రుకల్ని సేకరించి వాటిని ప్యాక్ చేసి, విమానాలు ఎక్కిస్తున్నారు. అయితే, ఈ మధ్య వీటి స్మగ్లింగ్ ఎక్కువ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement