Tuesday, May 21, 2024

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు..

తాటి చెట్టు పైనుండి పడి ఇ గీత కార్మికుడు తీవ్రంగా గాయపడిన సంఘటన పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామం లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గీత వృత్తిదారుడు బూరుగు కర్ణాకర్ గౌడ్ ప్రతినిత్యం మాదిరిగానే కల్లు గీసెందుకు తాటి చెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు.

ఈ ప్రమాదంలో కర్ణాకర్ గౌడ్ తీవ్రంగా గాయపడగా కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గీత కార్మికుడి ని ప్రభుత్వం ఆదుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement