Tuesday, April 30, 2024

ఇంగ్లండ్​ క్రికెటర్​ పబ్​లో మంటలు.. భారీగానే ఆస్తినష్టం..

ఇంగ్లండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్, మాజీ క్రికెటర్​ హ్యారీ గుర్నీతో కలిసి నాటింగ్ హామ్ షైర్ లో టాప్ అండ్ రన్ అనే పబ్ నిర్వహిస్తున్నారు. అయితే ఆ పబ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. పబ్ పైకప్పు, మొదటి అంతస్తు పూర్తిగా కాలిపోయాయి.. అప్పర్ బ్రాటన్ ప్రాంతంలో ఉన్న ఈ పబ్ లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే పబ్ పైకప్పు సహా భవనంలోని చాలా భాగం కాలిపోయింది. గణనీయమైన స్థాయిలోనే ఆస్తినష్టం జరిగినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement