Sunday, May 5, 2024

అధైర్య పడొద్దు.. అండగా ఉంటా… ప్రభుత్వ విప్ బాల్క సుమన్

కోటపల్లి (ప్రభ న్యూస్) : భారీ వర్షాలతో ముంపునకు గురై నిరాశ్రయులైన వారు అధైర్యపదవద్దని అండగా ఉంటానని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్ హామీ ఇచ్చారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం లోని కోటపల్లి మండలం రొయ్యల, సిర్సా గ్రామాల్లో వరద ప్రవాహంతో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించి ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా కల్పించారు. గ్రామాలకు వెళ్లేందుకు రహదారులన్నీ జలమయం కావడంతో పాటు రోడ్లు తెగిపోవడంతో కొంత దూరం ట్రాక్టర్ పై మరికొంత దూరం నడకతో వెళ్లి మరి తీర ప్రాంత ప్రజలను పరామర్శించారు.

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో చెన్నూరు నియోజకవర్గం లోని చాలా గ్రామాలు ముంపునకు గురై ప్రజలు నిరాశ్రయులయ్యారన్నారు. వరద నీటిలో అన్ని కోల్పోయి రోడ్డున పడ్డ వారికి ప్రభుత్వం తరఫున చేయూతనందిస్తామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అండగా ప్రభుత్వం ఉంటుందని, ఇలాంటివి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్యే వెంట జైపూర్ ఏసిపి నరేందర్, కోటపల్లి వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్ రావు తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement