Tuesday, May 14, 2024

రక్తదానం మరొకరికి ప్రాణదానం.. పెద్దపల్లి డీసీపీ

రక్తదానం ఆపదలో ఉన్నవారికి ప్రాణం పోస్తుందని పెద్దపల్లి డీసీపీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. శనివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దపల్లి జిల్లా పోలీసులు రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పోలీస్ అధికారులు సిబ్బందితో కలసి డీసీపీ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాలతో పాటు శస్త్ర చికిత్సల సమయంలో రక్తం లేక ఎందరో ఇబ్బందులు పడుతుంటారని వారి ఇబ్బందులను తొలగించేందుకు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, గోదావరిఖని ఏసీపీలు సారంగపాణి, గిరి ప్రసాద్, సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, సతీష్, ఎస్సైలు మహేందర్, రవీందర్, మౌనిక, సహదేవ్ సింగ్, శివాని, లక్ష్మణ్, రాజ వర్ధన్, ఉపేందర్, వెంకటకృష్ణ, రవి ప్రసాద్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement