Sunday, April 28, 2024

16న కరీంనగర్ కు సీఎం కేసీఆర్..

ఏర్పాట్లను పరిశీలించిన మేయర్, అధికారులు

ఈనెల 16న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరీంనగర్ కు రానున్నారు. రాష్ట్ర పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 16వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ రానున్నారు. ఈ నేపథ్యంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు బైపాస్ రోడ్డులోని కొండ సత్యలక్ష్మీ గార్డెన్ ను సంధర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. కమీషనర్ సేవా ఇస్లావత్, ఏసీపి తుల శ్రీనివాస్ రావు, సంబంధిత అధికారులతో కలిసి పార్కింగ్ స్థలాలు మరియు ప్రధాన రహాదారులు తనిఖీచేశారు. నగర పారిశుద్ద్యం, సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement