Friday, May 17, 2024

ఆరుగురు కార్మికుల‌కు విముక్తి క‌ల్పించిన సీఐడీ పోలీసులు

పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 11(ప్రభ న్యూస్): ఇటుక బట్టీల్లో నిర్భంధంలో ఉన్న వలస కార్మికులకు సీఐడి పోలీసులు విముక్తి కల్పిస్తున్నారు. సీఐడి డీజీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు కరీంనగర్ రీజియన్ సీఐడి సీఐ బి.తిరుపతి రెడ్డి, ఎస్సైలు మల్లేశం, సుమలత మంగళవారం పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట ఇటుక బట్టీల్లో ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. నిర్భంధంలో ఉన్న ఆరుగురు కార్మికులను గుర్తించారు. వారితో మాట్లాడి వివరాలు సేకరించారు. వారి స్వస్థలం ఒరిస్సా రాష్ట్రం పాదంపూర్ గ్రామానికి ఇటుక బట్టీ నుండి పంపించారు.

కృష్ణ మాజీ (34), ప్రేమ నంద్ మాజీ (10), చేతన్ బాగ్ (26), నగేష్ దొర (22), సరస్వతి మాజీ (30), బెలమతి బహాగ్ (72) లను రక్షించారు. పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్, పెద్దపల్లి లేబర్ అధికారి రాంమోహన్, ఆర్ఐ నవీన్ రావు సహకారంతో ఇటుకబట్టిలో తనిఖీ చేసి నిర్బంధంలో ఉన్న కార్మికులను పెద్దపల్లి పోలీస్ స్టేషన్ తరలించి అక్కడి నుండి ఒరిస్సా రాష్ట్రం పాదంపూర్ పంపించారు. విముక్తి పొందిన కార్మికులు పోలీసు అధికారులు, లేబర్, రెవెన్యూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement