Tuesday, May 7, 2024

నేరాల చేదనలో సిసి కెమెరాలు: సిపి

నేరాల నియంత్రణ చేదనలో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. సిసి కెమెరాల ఏర్పాటులో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. బుధవారం నాడు కరీంనగర్ లోని వాసుదేవ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 35 సిసి కెమెరాలను పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వై సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిసి కెమెరాల ఏర్పాటుతో అనేక నేరాలు వేగవంతంగా చేధించ బడుతున్నాయన్నారు. ఒక కెమెరా వంద మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు.  వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఉన్న సిసి కెమెరాలను కమాండ్ కంట్రోల్ నకు అనుసంధానం చేసి ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను సమీక్షిస్తున్నామని తెలిపారు. సిసి కెమెరాల ఏర్పాటుతో నేరాలు వేగంగా చేధించబడటంతో పాటు, నేరాలు నియంత్రణలోకి వస్తున్నాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు నూతన కెమెరాల ఏర్పాటు లో భాగస్వాములు కావడంతో పాటు తమ రక్షణ భద్రత కోసమే ఈ కెమెరాలు దోహదపడతాయనే విషయాన్ని గుర్తించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement