Tuesday, May 21, 2024

TS: పెద్దపల్లిలో బీఆర్ఎస్ దే విజయం… ఎమ్మెల్యే దాసరి

ఎవరెన్ని కుట్రలు పన్నినా పెద్దపల్లిలో బీఆర్ఎస్ విజయం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఎమ్మెల్యే స్వగృహం నుండి ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆర్డిఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ… గత పాలకులు స్వప్రయోజనం కోసం పనిచేసే అభివృద్ధిని గాలికి వదిలేసారన్నారు. గత తొమ్మిదిన్నర ఏళ్లలో వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని, కేసీఆర్ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో అమలు చేశారన్నారు.

రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, బీసీ బంధు, కేసీఆర్ కిట్టు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతినెలా 3వేల రూపాయలు అందిస్తామని, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛను రూ.6వేలకు, రైతుబంధును 16 వేలకు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం అందించడంతో పాటు ఐదు లక్షల రూపాయల బీమా వర్తింప చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎన్ని దొంగ హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, నియోజకవర్గ ప్రజల చేతిలో భంగపాటు తప్పదన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement