Tuesday, April 30, 2024

Pune : సీపీ చేతుల మీదుగా ఒలివా క్లీనిక్​ ప్రారంభం

పూణేలో ఒలివా క్లినిక్‌ను పూణే పోలీస్ కమీషనర్ రితేష్ కుమార్ ఒలివా క్లినిక్ యాజమాన్యం సోమ దయానంద్‌తో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పోలీస్ క‌మిష‌న‌ర్ రితేష్ మాట్లాడుతూ ఒలివా స్కిన్,హెయిర్ క్లినిక్ యాజమాన్యం తమ 3 వ బ్రాంచ్ ని ప్రారంభించ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు.

నేటి యువత తమ చర్మ సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, యువత తోపాటు సకుటుంబ సౌందర్యం, ఆరోగ్యం కోసం ఒలివా స్కిన్, హెయిర్ క్లినిక్ చక్కటి వేదిక అని కొనియాడారు. ఒలివా క్లినిక్ యాజమాన్యం సోమ దయానంద్ ని రితేష్ కుమార్ అభినందించారు. రానున్న రోజుల్లో దేశము లోని అన్నీ ప్రధాన నగరాల్లో సంస్థ ని విస్తరించాల‌ని కోరారు. అనంత‌రం క్లినిక్‌లో అందుబాటులో ఉన్న వివిధ సేవలు, క్లినిక్ ఇంచార్జ్ డాక్టర్ ద్వారా దిగుమతి చేసుకున్న యంత్రాల గురించి ఒలివా క్లినిక్ యాజమాన్యం సోమ దయానంద్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ పీఆర్‌ సలహాదారు పిఎస్ఆర్ మూర్తి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement